కరోన సంక్షోభంలోనూ.. సంక్షేమం..
1 min read– నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: అభివృద్దే లక్ష్యంగా రెండేళ్లలోనే చరిత్రలో మిగిలిపోయే సువర్ణ ఘట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారని మొత్తంగా 90 శాతంపైగా అభివృద్ధితో రాష్ట్రం ముందుకు నడిచిందని వైఎస్సార్‌సీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా నందికొట్కూరు పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను వైఎస్ఆర్‌సీపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నేరవేరుస్తున్నారని తెలిపారు. పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి సీఎం జగన్ ప్రతిక్షణం పేదల బాగోగుల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
సంక్షోభంలోనూ..సంక్షేమం…
కరోన కష్టం కాలంలోనూ ప్రజల సంక్షేమం మరవని ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనన్నారు ఎమ్మెల్యో తోగూరు ఆర్థర్. రాష్ట్రంలో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నామని.. అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ రెడ్డి, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు చెరుకుచర్ల రఘు రామయ్య, ధర్మరెడ్డి, సుమలత చిట్టిరెడ్డి, మహిళ విభాగం కో-ఆర్డినటర్ రమాదేవి, సర్పంచ్ లు ,కౌన్సిలర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.