NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నా డెడ్ బాడీ కూడ ఆ పార్టీలో చేరుదు ..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: యూపీ సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, రాహుల్ గాంధీ అత్యంత స‌న్నిహితుడు జితిన్ ప్రసాద్ బీజేపీలో చేర‌డం ప‌ట్ల కాంగ్రెస్ లో అంత‌ర్గత వేడి మొద‌లైంది. ఈ విష‌యం మీద కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌పిల్ సిబ‌ల్ ఘాటుగా స్పందించారు. జితిన్ ప్రసాద్ బీజేపీలో చేర‌డం ఆయ‌న వ్యక్తిగ‌త ప్రయోజ‌నాల కోస‌మ‌ని తెలిపారు. త‌న‌కే అలాంటి ప‌రిస్థితి వ‌స్తే బీజేపీలో మాత్రం చేర‌న‌ని చెప్పారు. త‌న శ‌వం కూడ బీజేపీలో చేర‌ద‌ని ఘాటుగా వ్యాఖ్యానించారు. చిన్నప్పటి నుంచి బీజేపీ రాజ‌కీయ భావజాలానికి వ్యతిరేకంగా పెరిగాన‌ని తెలిపారు. సిద్ధాంత రాజ‌కీయాల ద‌శ పోయిందని, ప్రస్తుతం వ్యక్తిగ‌త ప్రయోజ‌నాల కోస‌మే నేతలు పార్టీలు మారుతున్నార‌ని తెలిపారు. ఇది ఆయారాం, గ‌యారాంల ద‌శ అని చెప్పారు.

About Author