PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పచ్చని చెట్లు..ప్రగతికి మెట్లు :ఎస్పీ హర్షవర్ధన్ రాజు

1 min read

పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లారాయచోటి: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు.  ప్రపంచ పర్యావరణ దినోత్సవం  ను పురస్కరించుకొని  అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు  ఐ.పీ.ఎస్ గారు అన్నమయ్య జిల్లా  పోలీస్ ప్రధాన  కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు వనమహోత్సవం కార్యక్రమంలో  భాగంగా మొక్కలను నాటినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం నాటే ప్రతి మొక్క భూమాతకు మేలు చేస్తుంది అన్నారు. మనం పెంచే ప్రతి చెట్టు తరువాత తరాలకి కూడ వీటి ఫలాలను ఇస్తుంది అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని, అడవులను పెంచడం వలన ప్రకృతి వైపరిత్యాల నుండి కాపాడుకోగలమని, ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా అడవులను నాశనం చేయడం వలన భావితరాల వారికి జీవ నాడి అయినా ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందని, ఏ జీవి అయినా ఈ లోకంలో బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలని అటువంటి ఆక్సిజన్ ఇచ్చేది చెట్టు మాత్రమే అన్నారు. పచ్చని చెట్టు ప్రగతికి సోపాన మార్గం అని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ చెట్లను నరకకుండా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత స్వీకరించాలని తెలిపారు.  కార్యక్రమంలో  AR DSP కృష్ణ మోహన్,  రాయచోటి DSP పి. శ్రీధర్,  రాయచోటి సి.ఐ లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

About Author