ప్రతీ అర్జీని క్షుణ్ణంగా చదివి సత్వరం పరిష్కరించాలి
1 min read– సామాన్య ప్రజల సమస్యల పరిష్కరమే ధ్యేయంగా చిత్తశుద్ధితో పని చేయాలి
– అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్
పల్లెవలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: సామాన్య ప్రజల సమస్యల పరిష్కరమే ధ్యేయంగా చిత్తశుద్ధితో పని చేయాలని అధికారులను కలెక్టర్ గిరీష పిఎస్ ఆదేశించారు.సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్లో స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గిరీష పిఎస్, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డిఆర్ఓ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఉమామహేశ్వరమ్మలు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. జిల్లాలో స్పందన కార్యక్రమానికి సమస్యలపై ప్రజలు నుంచి పదేపదే వచ్చే అర్జీలను పరిష్కరించటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందనలో వచ్చిన ప్రతీ అర్జీని క్షుణ్ణంగా చదివి సత్వరం పరిష్కరించాలన్నారు. అర్జీలు పరిష్కరించటానికి వీలుకానివి సరైన కారణాలతో అర్జీదారులకు తెలియజేయాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. పరిష్కరించిన అర్జీలు రీ ఓపెన్ కాకుండా సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా నిర్దేశించిన గడుపులోపల క్లియర్ చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశంతో స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని… అధికారులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని స్పందన కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
స్పందన కార్యక్రమంలో వచ్చిన కొన్ని వినతులు:
గాలివీడు మండలం, గోరాన్ చెరువు, వడిశలవంకకు చెందిన ఏ.సుబ్బమ్మ తన భర్త మరణించాడని, తన భర్త పేరున ఉన్న భూమి సర్వేనెంబర్ 2368/4 విస్తీర్ణం 2.30 సెంట్లపైకి 1.15 సెంట్లు తన పేరు మీద ఆన్లైన్ చేయాలని వినతి పత్రం సమర్పించారు.వీరబల్లి మండలం సానిపాయికి చెందిన ఎన్.సిద్దయ్య తన భూమి సర్వేనెంబర్ 629లో ఇంటిని నిర్మించుకున్నాను. కానీ ఇతరులు నా ఆస్తిలో గోడ నిర్మించుకొనుటకు ఇబ్బందులు గురి చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.టి సుండుపల్లి మండలం, చెన్నం శెట్టిపల్లి చెందిన జె. బండయ్య చెన్నం శెట్టిపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీ అయినది. బీసీ కులం నోటిఫికేషన్ ఇచ్చినారు. కానీ ఊరి నందు బీసీలు ఎవరూ లేరు. ఓసికి నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా వారు అర్జీ సమర్పించారు.కలకడ మండలం, కలకడ కోనకు చెందిన కె వెంకటస్వామి తనకు మూడు చక్రాల వాహనం మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై బాధితులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, జేసి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.