మన శరీరంలో ప్రతి కణమూ తెలివైనదే.. తెలుసా..?
1 min readపల్లెవెలుగు వెబ్: పగలు, రేయి గురించి మనకు ఎంత బాగా తెలుసో మన శరీరంలోని కణాలకు కూడ అంతే తెలుసంట. వేళకు మనం ఎలా ప్రవర్తిస్తామో.. మన శరీరంలోని కణాలు కూడ అలాగే మసులుకుంటాయట. ‘శరీర గడియారం- ప్రతిస్పందనలు ’ గురించి ఐర్లండ్ కు చెందిన ప్రఖ్యాత రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ , యూనివర్శిటీ ఆఫ్ మెడిసన్స్ అండ్ హెల్త్ సైన్స్ స్ నిపుణులు ఈ విషయాలను కనుగొన్నారు. సాధారణంగా బ్యాక్టీరియాలు, వైరస్ లు మన మీద దాడి చేస్తే.. రోగనిరోధక వ్యవస్థ వాటి మీద దాడి చేసి.. మనల్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.