PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి పౌరుడు రాజ్యాంగం గొప్పతనాన్ని తెలుసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో డా. బీఆర్ అంబెడ్కర్ విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు .మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, శాప్ నంద్యాల ,కర్నూలు జిల్లా కోఆర్డినేటర్లు స్వామిదాసు రవికుమార్, పేరుమాళ్ళ శ్రీనాథ్ జాతీయ జెండా ఎగురవేశారు.రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని జనవరి 26 న ఆమోదించిన సంధర్భంగా ప్రతి ఏటా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మనకంటూ ఒక రాజ్యాంగ అవసరమని డా.బిఆర్.అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటయిందన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, భారత పౌరులందరికీ సమన్యాయం కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ప్రపంచంలోనే అది పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా మన దేశానికి పేరు వచ్చిందని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రతి భారత పౌరుడికి స్వేచ్చ, స్వాతంత్రాలను, హక్కులను, విధులను మన రాజ్యాంగం కల్పించిందన్నారు. ఇంత పెద్ద భారత దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛగా, స్వాతంత్రంగా జీవించగలుగుతున్నామంటే డా.బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనమన్నామని అన్నారు . భారత ప్రజలందరూ రాజ్యాంగం యొక్క గొప్ప తనాన్ని, విలువలను తెలుసుకొని మంచి నడవడికతో జీవించాలని వారు సూచించారు.

About Author