ప్రతి పౌరుడు బాలల హక్కులను పరిరక్షించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో 13.07.2023 వ తేదీ న స్థానిక బి.క్యా౦ప్ లోని చాంద్ ఓకేషనల్ జూనియర్ కళాశాలలో చైల్డ్ రైట్స్ ( బాలల హక్కులు మరియు పొక్సో ఆక్ట్ 2012 ) అవగాహనా కార్యక్రమం నిర్వహించడo జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి టి.శారద మాట్లాడుతు సమాజంలో బాలల హక్కులను ఉల్లగించే సంఘటనలు జరుగుతున్నాయని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రతి పౌరుడు బాలల హక్కులను తెలుసుకొని, పరిరక్షించాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఈ సందర్భంగా తెలిపారు, ముక్యంగా బాలలు తెలుసుకోవాల్సిన హక్కులు నాలుగు వాటిలో జీవించే హక్కు, బాగస్వామ్యపు హక్కు, రక్షణ పొందే హక్కు, పాల్గొనే హక్కు అని తెలియజేసారు. చైల్డ్ హెల్ప్ లైన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అయిన డి సుంకన్న మాట్లాడుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు చైల్డ్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాల్ సెంటర్ 24 గంటలు (24/7) పిల్లల సంరక్షణార్థం కోసం పనిచేయడం జరుగుతుంది అయితే దేశవ్యాప్తంగా బాలల సమస్యలను చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కాల్ సెంటర్ నెంబర్ 08518 231098 కాల్ చేయవలెనని తెలిపారు కావున బాలల సమస్యలను ఈ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ కి ఏ సమయంలోనైనా తెలుపగలరని చెప్పడం జరిగింది. అనంతరం ఐ సి పి ఎస్ సోషల్ వర్కర్ ఎన్ నరసింహులు మాట్లాడుతూ పోస్కో ఆక్ట్ 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపోందించారు అని తెలపడం జరిగింది అనంతరం చైల్డ్ హెల్ప్ లైన్ గోడపత్రిక ను డి సి పి ఓ టి.శారద చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్వేత కీర్తి, నాగ హుస్సేన్ పాల్గొనడం జరిగింది.