జగనన్న పాలనలో ప్రతి కుటుంబానికీ లబ్ధి
1 min read‘గడప గడపకు మన ప్రభుత్వం’లో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
పల్లెవెలుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి పేద కుంటుంబానికి లబ్ధి చేకూరిందని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. శనివారం ఉదయం స్థానిక 13వ వార్డులో మున్సిపల్, సచివాలయ సిబ్బందితో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బంగారుపేట ప్రాంతాల్లోని వీధుల్లో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ పథకాల ద్వారా కల్పిస్తున్న లబ్ధిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందేందుకు ఎవరి సిఫార్సులు అవసరం లేదని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు లేదా ఇంటికి వచ్చే వలంటీర్లను సంప్రదిస్తే చాలని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.