NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

1 min read

– రాయచోటి ట్రాఫిక్ ఎస్ఐ రఫీ

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు రాయచోటి పట్టణంలో అత్యంత రద్దీ వ్యాపార ప్రాంతాలైన గాంధీ బజార్ మరియు కంసల వీధులలో ట్రాఫిక్ జామ్ ను నివారించుటకు “వన్ సైడ్ పార్కింగ్” ను అమలు చేస్తున్నామని రాయచోట్టి ట్రాపిక్     ఎస్ ఐ రఫి తెలిపారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వాహన దారులు ప్రతి ఒక్కరు ట్రాపిక్ నిబంధనలు పాటించాలన్నారు .కొద్దిమంది వాహనదారులు వన్ సైడ్ పార్కింగ్ ను పాటించకుండా ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేయడం జరుగుతున్నది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని,  వన్ సైడ్ పార్కింగ్ లోనే వాహనాలు పార్కింగ్ చేసుకొవాలని, దానికి ఇవతల వైపు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తమ వాహనాలను పార్కింగ్ చేయరాదని సూచిస్తూ “నో పార్కింగ్ ఫ్లెక్సీ” లను ఏర్పాటు చేయడం జరిగినది. నో పార్కింగ్ రూట్ నందు వాహనదారులు ఎట్టి పరిస్థితులలో పార్కింగ్ చేయకూడదని, అలా చేస్తే రాయచోటి ట్రాఫిక్ పోలీసు వారు జరిమానాలు విధించి కఠిన చర్యలు తీసుకుంటారని తెలియజేయడమైనది.కావున రాయచోటి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు పై సమాచారాన్ని గమనించి వన్ సైడ్ పార్కింగ్ ను పాటిస్తూ వాహనాల by రాకపోకలకు, ట్రాఫిక్ కు  ఎటువంటి అంతరాయం కలిగించకుండా ఉండాలని హెచ్చరించడమైనది.

About Author