వీహెచ్పిలో బాధ్యత కలిగిన ప్రతి కార్యకర్తకు శిక్షణ అవసరం…
1 min read
విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయిరెడ్డి…
పల్లెవెలుగు, కర్నూలు: శనివారం జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద గల విజ్ఞాన పీఠం (అరక్షిత శిశు మందిరం) లో విశ్వ హిందూ పరిషత్ 2 రోజులు జిల్లా “అభ్యాస వర్గ” ( శిక్షణా తరగతుల)ను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం ఉధ్ఘాటన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ….విశ్వ హిందూ పరిషత్ సంస్థలో బాధ్యతలు తీసుకున్న, శిక్షణా నంతరం బాధ్యతలు తీసుకుంటున్న కార్యకర్తలందరికీ సంస్థ యోక్కవిధి,విధానాలు,లక్ష్యాలు,హిందూ సమాజం కోసం సంస్థ చేసే కార్యకలాపాల అవగాహన కోసం, సంస్థను గ్రామ గ్రామాన విస్తరించడం కోసం ప్రతి జిల్లా,ప్రఖంఢ, బస్తీ,గ్రామస్థాయి కార్యకర్తలకు రెండురోజుల జిల్లా అభ్యాసవర్గ(శిక్షణా తరగతులు) నిర్వహిస్తున్న ఈ శుభ సందర్భంలో శిక్షణకు వచ్చిన కార్,కర్తలందరీకీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి వెంకట్రామయ్య మాట్లాడుతూ నూతనంగా గ్రామస్థాయి నుండి ఈ శిక్షణా తరగతులకు విచ్చేసిన కార్యకర్తలు రెండు రోజులపాటు ఇక్కడ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో శ్రద్ధతో ఇకైకడ చెప్పిన ప్రతి విషయాన్ని రాసుకుని, శిక్షణ పూర్తి అయిన తరువాత మీ మీ కార్యక్షేత్రాలలో విశ్వ హిందూ పరిషత్ కార్యకలాపాలను విస్తరించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాళిగి వ్యాసరాజ్,రాష్ట్ర సహకార్యదర్శి యస్.ప్రాణేష్, అభ్యాసవర్గ అధికారి అనంత విశ్వ ప్రసాద్, కర్నూలు జిల్లా అధ్యక్షులు టి.సీ.మద్దిలేటి, జిల్లా కార్యదర్శి, అభ్యాసవర్గ వ్యవహార కర్త మాళిగి భానుప్రకాష్,సహకార్యదర్శి శిక్షణా తరగతుల పర్యవేక్షకులు గూడూరు గిరిబాబు ,వ్యవస్థా ప్రముఖ్ ఈపూరి నాగరాజు, అయోధ్య శ్రీనివాస రెడ్డి, ఈపూరి లక్ష్మి, మాళిగి పావని, మరియు వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.