ప్రతి విద్యార్థి ఇష్టంతో చదవాలి. భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలి
1 min read– పాఠశాల కరస్పాండెంట్ ఎం రామేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ప్రతి విద్యార్థి ఇష్టంతో చదవాలని శ్రీ రాజరాజేశ్వరి పాఠశాల కరస్పాండెంట్ ఎం. రామేశ్వరరావు తెలిపారు ఫేర్వెల్ డే వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ 1985సంవత్సరంలో ఐదు మంది విద్యార్థులతో పాఠశాలనుప్రారంభించా మని నేడు దాదాపు 1600 మంది విద్యార్థులు శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు అన్నారు. ఐదు మందితో ప్రారంభించిన ఈ పాఠశాల లో చెందిన విద్యార్థులు నేడు నలుగురు ఉపాధ్యాయ వృత్తిలో ఒకరు వైద్యాధికారి గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో చదివిన పూర్వపు విద్యార్థులు దాదాపు ఎంతో మంది విద్యార్థునీ విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని తెలిపారు. పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు మానసిక ప్రశాంతతతో ధైర్యంగా ఎదుర్కోవాలని పాఠ్యాంశంలోని అన్ని సిలబస్ ను చదివిపూర్తిగా అర్థం చేసుకొని పరీక్షల్లో మంచి ఫలితం సాధించాలని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఈ సమయం ఎంతో కీలకమైంది అన్నారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను మరియు సినిమాలకు క్రికెట్కు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ పెట్టి చదవాలన్నారు. విద్యార్థులు ముందుగా ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశంపై అర్థం చేసుకోగలిగితే పరీక్షలు ఎదుర్కోవడం కష్టం కాదన్నారు. మానసిక ప్రశాంతతో విద్యపై శ్రద్ధ పెట్టాలన్నారు. బాగా చదివి తల్లిదండ్రులకు .పాఠశాలకు మంచి పేరు తేవాలని అన్నారు. పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితాలకు కీలకమైన మలుపునని మంచి ఫలితాలు సాధిస్తే ఉన్నత చదువులకు సులుభం అవుతుందన్నారు. సమాజంలో ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల కంటే అధిక ప్రయాణం ఉపాధ్యాయులదే అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది రఘురాం శర్మ. కిట్టు. ప్రభుత్వ ఉపాధ్యాయులు. సుబ్బరాయుడు. అబ్దుల్ రావుోఫ్. గఫూర్. చెన్నయ్య. విద్యార్థిని .విద్యార్థులు ఉపాధ్యాయుని. ఉపాధ్యాయులుపాల్గొన్నారు.