చట్టాలపై ప్రతి ఒక్క మహిళ అవగాహన కలిగి ఉండాలి
1 min read– లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 9న న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నైస్ యూత్ ఫర్ గర్ల్స్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, అభ్యుదయ యువజన సంఘం ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ మొదటి లైన్ లో ఉన్న నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో మహిళల హక్కులు -చట్టాలు అనే అంశంపై సీనియర్స్ విభాగంలో వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీల ప్రారంభ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ లయన్స్ జిల్లా ఎడిషన్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ దిశ యాప్ ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుని ఉండాలన్నారు .9న జాతీయ న్యాయ సేవా దినోత్సవం పురస్కరించుకొని చట్టాలపై అవగాహన కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఈ వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నామని, ప్రతి మహిళ ఉచిత న్యాయ సలహా పొందే హక్కు ,ఆత్మ రక్షణ హక్కు, సమాన వేతన హక్కు, పని ప్రదేశాలలో హక్కులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నిర్భయ చట్టం ,శిశు సంరక్షణ చట్టం, డొమెస్టిక్ వైలెన్స్ చట్టం, మహిళా రక్షణ చట్టం తదితర చట్టాలపై పిల్లలకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెలివిన్ జోన్స్ సభ్యులు ,నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.