ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలి..
1 min read– అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ రాజ్ కమల్,
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో సెన్సేటైజేషన్ ప్రోగ్రాం ఆన్ కర్బింగ్ చైల్డ్ మ్యారేజెస్ అండ్ ఉమన్ ఎంపవర్మెంట్ ఫర్ లైవ్లీహుడ్ అనే సోషల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *డాక్టర్ వి బి రాజ్ కమల్ ఎంబిబిఎస్ అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అన్నమయ్య జిల్లా మరియు *శ్రీ సుభాష్ గారు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అన్నమయ్య జిల్లా మరియు *బి నాగేశ్వరరావు గారు గుడ్ నైబర్స్ ఇండియా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు మేనేజర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, కుటుంబ వ్యవస్థ బలం కావాలంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలందరూ సొంతంగా తమ కాళ్ళ మీద ఆర్థికంగా స్థిరం కావాలని తెలిపారు. అలాగే చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరగకూడదని, ఈ చైల్డ్ మ్యారేజ్ మూలంగా మహిళలు ఆర్థికంగా చాలా నష్టపోతారని వాళ్ళ కుటుంబ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని, కాబట్టి చైల్డ్ మ్యారేజ్ జరగకుండా మనం చూడాలని కోరారు.అనంతరం శ్రీ. సుభాష్ మాట్లాడుతూ ఈ చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా చూడ్డానికి జిల్లా యంత్రాంగం సాయ శక్తుల ప్రయత్నిస్తుందని గతంలో లాగా ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ జరగట్లేదు బాగా తగ్గిపోయాయని అయినా కూడా నిరంతరాయంగా జిల్లా యంత్రాంగాలు ప్రయత్నిస్తూ చైల్డ్ మ్యారేజెస్ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయని తెలిపారు. అలాగే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఫర్ లైవ్లీ హుడ్ విషయం పరంగా మాట్లాడుతూ స్త్రీలు సొంతంగా చదువుకొని మరియు ఏదైనా నైపుణ్యము నేర్చుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆ కుటుంబo ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా కష్టపడి ఆర్థికంగా బలపడి కుటుంబాన్ని బలం చేసుకోవాలని అలాగే వ్యవస్థను బలం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్ నైబర్స్ ఇండియా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు మేనేజర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక చైల్డ్ మ్యారేజ్ ని ఎలా ఆపాము, అన్న కేస్టడీ గురించి చెప్పారు. సంబేపల్లి మండలంలో ఒక చైల్డ్ మ్యారేజ్ ని ఎలా ఆపాము, ఆపడానికి ఎంతగా కష్టపడ్డామో, దానికి వ్యతిరేకత ఎంతగా వచ్చింది అనేది సవివరంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ పి శివశంకర్ గారు మరియు స్టాఫ్ శ్రీమతి సుధానిధి, మైథిలి మరియు విద్యాసాగర్ గారు, సిబ్బంది పాల్గొన్నారు.