ప్రతి మహిళ ఉన్నత విద్యను అభ్యసించాలి
1 min read– జిల్లా కలెక్టర్ గారి సతిమణి,శ్రీమతి స్వర్ణలత
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రతి మహిళ ఉన్నత విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ గారి సతిమణి,శ్రీమతి స్వర్ణలత పిలుపునిచ్చారు.శుక్రవారం అంతర్జాతీయ మహిళాదినోతస్సవం” సందర్భంగా కలెక్టరు ఆఫీసు నుండి రాజవిహర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ గారి సతిమణి,శ్రీమతి స్వర్ణలత జెండా ఊపిప్రారంభించారు.సెట్కూర్ సిఇఓ పి.వి. రమణ, మెప్మా పిడి శ్రీమతి నాగశివలీలా, డిఎస్పి యస్. మహబూబ్ భాష, . స్పెషల్ పోలీస్,జి .సత్యనారాయణ, పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ గారి సతిమణి,శ్రీమతి స్వర్ణలత మాట్లాడుతూ ప్రతి మహిళ ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలందరికీ సాంకేతిక పరిజ్ఞానంచాలా అవసరమని, సాంకేతిక పరిజ్ఞానంతో ధైర్యంగా ముందుకెళితే సమస్యలన్నీ ఎదుర్కొని ఉన్నత స్థాయిలకు ఎదగవచ్చని తెలిపారు.విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకు రాగలమని, ఆడపిల్లలకు చదువు ఎంతో అవసరమని, తల్లిదండ్రులు ఆడ, మగ అనే తేడా లేకుండా పిల్లలు ఇద్దరినీ సమానంగా చదివించాలన్నారు.
సెట్కూర్ సిఇఓ పి.వి. రమణ, మాట్లాడుతూ
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ వారి ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, కర్నూలు వారు “అంతర్జాతీయ మహిళాదినోతస్సవం” సందర్భంగా 10-03-2023 నుండి 25-03-2023 తేది వరకు క్రీడా పోటీలు, పోషకాహరం పై అవగాహన ఉచిత వైద్య శిబిరాలు,నిర్వహించబడుతున్నాయి. 11-03-2023 తేదిన మెడికల్ క్యాంప్, వృద్ధుల నడక పోటీలు మరియు కబడ్డీ పోటీలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, అవుట్ డోర్ స్టేడియం, కర్నూలు లో నిర్వహించడం జరుగుతునాది. ఈ కార్యక్రమములో ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని సెట్కుర్ సీఈవో తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ అధ్యాపకులు శ్రీమతి భారతి, .వి.ఆర్. కళాశాల విద్యార్ధినులు, యస్.వి.ఆర్. ఆర్. ఆర్. విజేత అకాడమీల విద్యార్థినులు, మెప్మా మరియు మునిసిపల్ కార్పోరేషన్ ఉద్యోగినులు, వ్యాయోను ఉపాధ్యాయులు, మహిళ కార్యకర్తలు, శిక్షకులు మరియు డి.యస్.ఎ. సిబ్బంది పాల్గోన్నారు.