తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
1 min read
సైనికుల త్యాగాలను గుర్తించుకుంటూ తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి- లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
కర్నూలు, న్యూస్ నేడు : నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిజం డే ని పురస్కరించుకొని నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో జరిగిన ‘ తీవ్రవాదం నిర్మూలించడంలో మన వంతు పాత్ర ‘ అనే అంశంపై జరిగిన వ్యాసరచన మరియు అవగాహన కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రెటరీ ,నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం మే 21 న ఆంటీ టెర్రరిజం డేగా జరుపుకుంటామని, దేశంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు నిర్దేశించబడిందని, ప్రతి పౌరుడు శాంతి, ఏకత్వం, జాతీయత భావాలతో దేశ అభివృద్ధికి పాటుపడాలన్నారు. మతపరమైన, ప్రాంతీయ భావాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా అందరం కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్ సభ్యులు ,లక్ష్మీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు లయన్ రాయపాటి నాగలక్ష్మి ,యువతీ యువకులు పాల్గొన్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా మనమందరం శాంతి కోసం కృషి చేయాలని యువతి యువకులచే ప్రతిజ్ఞ చేయించారు.