గడపగడప కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలి
1 min read– ఈ ఓ ఆర్ డీ.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఈనెల 10వ తేదీ నుంచి మండల కేంద్రంలోని గడివేముల గ్రామంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే గడపగడప కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు గ్రామ సచివాల సిబ్బంది వాలంటీర్లు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రతి ఇంటి వివరాలు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని సోమవారం నాడు గ్రామ సచివాలయంలో సచివాల సిబ్బంది వాలంటీర్లతో సమావేశమైన ఈఓఆర్డి ఖలీక్ భాష ఆదేశించారు గైర్హాజరు కాకుండా పాల్గొనాలని సమావేశాలకు కొంతమంది వాలంటీర్లు రాకపోవడం ముందస్తు సమాచారం లేకపోవడంతో సమావేశాలకు హాజరు కాకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.