NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బహుజన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

1 min read

– ఎస్సీ’ ఎస్టీ’ బీసీ, మైనార్టీలంతా కలిసికట్టుగా ముందుకు రావాలి
– బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు గద్దల నాగభూషణం
– బహుజన సమాజ నిర్మాణ సాధకులకు ఘన సన్మానం
పల్లెవెలుగు వెబ్ అనంతపురం : బహుజన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు గద్దెల నాగభూషణం పిలుపునిచ్చారు. ఇందుకోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా ఒక్కతాటిపైకి వచ్చి ఐకమత్యంతో బహుజన రాజ్య స్థాపనకు కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా బహుజన రాజ్య స్థాపనకు విశేషంగా కృషి చేస్తున్న పలువురిని బీఎస్పీ, బాంసేపు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు బహుజన నిర్మాణానికి కృషి చేస్తున్న వారి సేవలను కొనియాడారు. బహుజన సమాజ నిర్మాణంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చిన ల్యాబ్ టెక్నీషియన్ సంగ వేణుగోపాల్ ను బిఎస్పీ యువ నాయకుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బిఎస్పి జిల్లా ఇన్చార్జి తిరుమలయ్య, యువ నాయకుడు లక్ష్మీనారాయణ, బాంసప్ నాయకులు పాల్గొన్నారు.

About Author