శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
1 min read– రాయచోటి ట్రాఫిక్ ఎస్ఐ రఫీ
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి వాహనదారులు ప్రతి ఒక్కరు సహకరించాలని రాయచోటి ట్రాఫిక్ ఎస్ఐ రఫీ పేర్కొన్నారు.అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల తో, రాయచోటి సబ్ డివిజన్ డిఎస్పి సార్ మరియు రాయచోటి అర్బన్ సిఐ సార్ ఉత్తర్వుల మేరకు,, ద్విచక్ర వాహనాలకు గల మాడిఫైడ్ సైలెన్సర్ల వల్ల వచ్చే అధిక శబ్దంతో ప్రజలు అసౌకర్యం కలిగి ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున వాటిని నిరోధించాలని, రాయచోటి పట్టణంలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్ మరియు ఇతర బైక్ లకు అమర్చి ఉండే మాడిఫైడ్ సైలెన్సర్ లపై పలుమార్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక శబ్దం వచ్చే మాడిఫైడ్ సైలెన్సర్ లు గల రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్ లను గుర్తించి మాడిఫైడ్ సైలెన్సర్లను తీపించి జరిమానాలు విధించడమైనది. ఈ మాడిఫైడ్ సైలెన్సర్ లను వాడే మోటర్ బైక్లు, ఇతర వాహనదారులు గమనించి, అధిక శబ్దం వచ్చే మాడిఫైడ్ సైలెన్సర్లు వాడకుండా, ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ఉండాలని లేనిచో రాయచోటి ట్రాఫిక్ పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.