గ్రామపంచాయతీ అభివృద్ధికి- ప్రతి ఒక్కరు సహకరించాలి
1 min read– కోటి రూపాయలతో డ్రైనేజీ, సిమెంట్ రోడ్డు పనులు
– సర్పంచ్ సిద్ది గారి వెంకటసుబ్బయ్య
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : గ్రామపంచాయతీ అభివృద్ధి కి ప్రతి ఒక్కరు సహకరించాలని, సర్పంచ్ సిద్ది గారి వెంకటసుబ్బయ్య, కార్యదర్శి రామసుబ్బారెడ్డిలు అన్నారు, సోమవారం ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులకు గ్రామపంచాయతీ అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా సర్పంచ్, కార్యదర్శులు మాట్లాడుతూ చెన్నూరు కొత్త రోడ్డు పై నుండి,( వనం వీధి) వరకు డి ఎం ఎఫ్ ఫండ్ ద్వారా కోటి రూపాయల వ్యయంతో ఇరువైపులా డ్రైనేజీ, అలాగే సిమెంట్ రోడ్డు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు, రోడ్డు, డ్రైనేజీ పనులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తో టెక్నికల్ పరమైన అంశాలతో పనులను చేపట్టడం జరుగుతుందని వారు తెలియజేశారు, డ్రైనేజీ నీరు వెళ్లేందుకు అణువుగా ఉండేందుకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారని అదేవిధంగా సిమెంటు రోడ్డు కు సంబంధించి దాదాపు 20 అడుగుల వెడల్పుతో వేయడం జరుగుతుందన్నారు, దీంతో ఎక్కడ కూడా రోడ్ల పైన దుమ్ము , దూళి కానీ వర్షపు నీరు కానీ నిలువ ఉండడం జరగదని వారు తెలిపారు, కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి గ్రామపంచాయతీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం జరుగుతుందన్నారు, అయితే ఈ నిధుల ద్వారా ప్రజా ప్రతినిధులైన మనం, ప్రజలందరికీ మేలు జరిగే విధంగా, గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించే విధంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు, అంతేకాకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్లు అందరూ సమన్వయంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు, అంతే కాకుండా ఎక్కడైనా శానిటేషన్, సమస్య ఉన్న, త్రాగు నీటి సమస్య, విద్యుత్ సమస్య ఉన్న ఎడల తమ దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరించ పడతాయని ఆయన తెలియజేశారు, ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు టిఎన్ మహేశ్వర రెడ్డి, కృష్ణారెడ్డి, గుమ్మల్ల రామకృష్ణారెడ్డి, ఓబుల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.