ప్రతి ఒక్కరు ఆరోగ్య ప్రమాణాలను పాటించాలి
1 min read– ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ప్రతి ఒక్కరు పరిసరాల పట్ల బాధ్యత, ఆరోగ్యం పట్ల ప్రమాణాలను పాటించినట్లయితే రాష్ట్రాన్ని ఆరోగ్యఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దవచ్చని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు, ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన (గ్లోబల్ వాషింగ్ డే) ప్రపంచ చేతులు పరిశుభ్రపరచుకునే దినము) మీ ఆరోగ్యం మీ చేతుల్లో ” ప్రతి ఒక్కరు చేతులను పరి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు, ప్రతి ఒక్కరు కనీసం రోజులో నాలుగైదు సార్లు చేతులను సబ్బుతో కనీసం 10 సెకన్లు కడుక్కోవడం వలన అనేక రకాల జబ్బుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చునని ఆయన తెలిపారు, ఈ విషయాల పైన ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలని అయన తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారిణి శకుంతల,ఎ.పి.యం.గంగాధర్,సీనియర్ నాయకులు మహిళా వి.ఓ.ఎ లు పాల్గొన్నారు. అనంతరం హ్యాండ్ వాషింగ్ ఎలా చేసుకోవాలో వారు తెలియజేయడం జరిగింది.