ఎన్నికల నిబంధనలు అందరూ పాటించాలి
1 min read– పోలింగ్ బూత్‌ల వద్దకు ఓటర్లు మొబైల్ ఫోన్స్, ఐ పాడ్, టాబ్స్ మరియు ఇతర ఎలెక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో ఎస్పీ శ్రీ కె. రఘువీర్ రెడ్డి IPS ఆదేశాల మేరకు సి ఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఈ నెల 13న జిల్లాలో ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట భద్రత మరియు బందోబస్త్ ఏర్పాటు చేశామని, ఎన్నికలుపకడ్బందీగా,నిష్పక్షపాతంగా, పారదర్శకంగా,విజయవంతంగా నిర్వహిం చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎన్నికల నిబంధలు ప్రతి ఒక్కరు పాటించాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు తమ దృష్టికివస్తేకఠినచర్యలుతప్పవనిహెచ్చరించారు.ఎవ్వరూ గొడవలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించాలని కోరారు. అభ్యర్ధులు, ఓటర్లు, ఏజెంట్లు ఎన్నికల నియమావళిని (MCC) తప్పనిసరిగా పాటించాలి.R.O అధికారి గారి యొక్క ఉత్తర్వులు తూచా తప్పకుండా పాటించాలి.పోలింగ్ నిర్వహించే అధికారులు తో సహా ఎవరు పోలింగ్ కేంద్రాలలోనికి నీరు మరియు ఇతర ద్రవ పదార్ధాలను తీసుకువెళ్లరాదు. ఓటర్లు, ఏజెంట్లు, అభ్యర్ధులు మొబైల్ ఫోన్స్, ఐ పాడ్, టాబ్స్ మరియు ఇతర ఎలెక్ట్రానిక్ వస్తువులు పోలింగ్ కేంద్రంలోనికి తీసుకువెళ్ళడానికి అనుమతిలేదు.పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్లు అమలులో ఉంటున్నందున ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదు.ఎన్నికల సందర్భంగా ఎవరైనా రెచ్చగొట్టేవిధంగా వాక్యాలు చేయడం, కవ్వింపు చర్యలకు గాని పాల్పడటం వంటివి చేయరాదు.అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి పనులు చేయరాదుఎవరైనా పోలింగ్ బూతు లోపల ఫోటోలు, వీడియోలు తీసి ఎన్నికల నియమాలకు విరుద్ధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడును. సీఐ సుబ్బరాయుడు తెలిపారు.