అజాదీ కా అమృత్ మహోత్సవం లో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలి
1 min read– ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: రాష్ట్రంలో ఆగస్ట్ 15 వేడుకలలో భాగంగా అజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ‘నా భూమి, నా దేశం, నెల తల్లికి నమస్కారం, వీరులకు వందనం పేర నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎంపీపీ గాలి వీటి. రాజేంద్ర నాథ రెడ్డి కోరారు.అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలం లోని పెద్ది వీడు, సంగం వాండ్ల పల్లి, మట్లి, ఓదివీడు పంచాయతీలలోని గ్రామ సచివాలయాల్లో శుక్రవారం నిర్వహించిన ‘నా భూమి నా దేశం’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిగా పాల్గొన్నారు. తొలుత గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి సత్కరించారు. స్థానిక అమరవీరుల పేర్లు గల శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల సంస్మరణార్థం మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సంక్షేమం కోసం ప్రాణత్యాగాలు చేసిన స్థానిక మహనీయులు, సాహసవంతులు, వీరులను స్మరించుకోవాల్సి ఉందన్నారు. పుట్టుకతో ఈ నేలపై బంధం పెంచుకున్న మనం దేశభక్తి స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ది వీడు సొసైటీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, మట్లి సర్పంచ్ నాగార్జున చారి, ఓదివీడు ఎంపీటీసీ రాజు, ఈ పి ఓ ఆర్ డి రామచంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు చంద్రుడు, సచివాలయాల సిబ్బంది ఉపాధి హామీ ఇబ్బంది ప్రజలు పాల్గొన్నారు.