ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి… సంరక్షించాలి!
1 min read
-ప్రధానోపాధ్యాయులు భాస్కర్
పత్తికొండ, న్యూస్ నేడు: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని, అప్పుడే ఈ భూమ్మీద ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని ప్రధానోపాధ్యాయులు భాస్కర్, యువ స్పందన సొసైటీ ఉపాధ్యక్షులు లక్ష్మన్న తెలిపారు. మంగళవారం పత్తికొండ మండల పరిధిలోని దూదెకొండ గ్రామంలో ఉన్న ఎంపీపీ స్కూల్ నందు యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో ధరిత్రీ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ప్రస్తుతం భూమ్మీద ప్లాస్టిక్ మరియు వాహనాల కాలుష్యం వల్ల భూమి వేడేక్కి వాతావరణంలో మార్పులు వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మొక్కలను పెంచాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణుడు, హుస్సేన్, శంకరప్ప, రహీం, యువ స్పందన సహాయ కార్యదర్శి గిరీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
