ప్రతి ఒక్కరూ మహాత్మ జ్యోతిరావు పూలే ను ఆదర్శంగా తీసుకోవాలి
1 min read– బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే: కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరుణాకర్
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రమైన స్థానిక బస్టాండ్ ఆవరణలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుల వ్యవక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కరుణాకర్,ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షుడు దండు ఖాజా, ఆర్ఎంపి డాక్టర్ తిరుపతయ్య లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారని ఆయన సేవలను కొనియాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడని, వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి ఎంతో కృషి చేసిన సంఘసంస్కర్త అని, మహాత్మ జ్యోతిరావు పూలే వితంతు పునర్వివాహం గురించి చైతన్యం తీసుకు వచ్చారని శూద్రులకు చదువు నేర్పించాల్సిన అవసరం ఉందని అప్పటి బ్రిటీష్ పాలకులతో పాఠశాలలు ఏర్పాటు చేయించారని కనుక సమాజంలో నిమ్న జాతులు, స్త్రీలు, కార్మికులు, కర్షకులు ఎలా దోపిడీకి గురవుతున్నారో, ఎలా అణచివేయ బడుతున్నారో చూసి వారికి ప్రతిఘటన మార్గం చూపించారని ప్రతి ఒక్కరూ కృషి పట్టుదలతో పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బతకన్న, ఆటో యూనియన్ నాయకులు వీరన్న గౌడ్, హమాలి యూనియన్ నాయకులు హనుమంతు నరసింహుడు తదితరులు పాల్గొన్నారు.