NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏసుక్రీస్తు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి

1 min read

మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  క్రైస్తవ సోదరులు ఏసుక్రీస్తు అడుగుజాడల్లో నడవాలని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా మంత్రాలయం మండలం రచ్చమరి గ్రామంలో సి.ఎస్.ఐ చర్చిలో, పెద్దకడబూరు లో సి.యస్.ఐ, చర్చిలో ఆర్ సి యం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి కి సంఘ కాపరి, సంఘ పెద్దలు ఘన స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు చేసి పాలకుర్తి తిక్కారెడ్డిని ఆశీర్వదించారు. శాలువ కప్పి పూలమాలవేసి సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రైస్తవులందరూ ఏసుక్రీస్తు అడుగుజాడల్లో నడవాలని ఏసుక్రీస్తు చెప్పిన మాటలను మనము నమ్మాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, పెద్ద కడుబూరు మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, క్లస్టర్ ఇంచార్జ్ చావిడి వెంకటేష్, బీసీ సెల్ మంత్రాలయం నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, బిసీ సాధికారక రాష్ట్ర సభ్యులు కురువ మల్లికార్జున, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి గోపాల్ రెడ్డి, మీసేవ ఆంజనేయులు, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు, లక్ష్మారి యోసేపు. మధు. రాముడు. కాశీము .ఉరుకుందు. ఇమ్మానియేల. తిక్కన్న. చిన్నోడు. హుసేని. సుధాకర్ . నాగరాజు. అనిల్, బండ్రాల నరసింలు, జంగం మర్రిస్వమి గువ్వుల భీమన్న, జెట్టి వీరేశ, బొజ్జప్ప , సంఘ పెద్దలు ప్రసాద్ , మార్క్,దేవమని ,బొజ్జప్పా, చిదానంద ,తదితరులు పాల్గొన్నారు.

About Author