ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలి: చిన్న జీయర్ స్వామి
1 min read–నూతన అన్నమయ్య జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి…
–రాయచోటిలో జరిగిన అన్నమయ్య సహస్ర గళార్చనలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామాన చినజీయర్ స్వామి
– శ్రీ శ్రీ చినజీయర్ స్వామి కి ఆత్మీయ స్వాగతం పలికిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి,తంబల్లపల్లె ఎంఎల్ఏ ద్వారక నాధ రెడ్డి
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి:ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని వేదగురువు, ఉపదేశకులు, శ్రీ వైష్ణవ ప్రముఖుడు శ్రీ శ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పేర్కొన్నారు. మంగళవారం రాత్ర రాయచోటి పట్టణంలోని దశరథ రామిరెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన రాచవీడు అన్నమయ్య కళాపీఠం నిర్వహణలో అన్నమయ్య సహస్రగళార్చన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారు పాల్గొన్నారు.కార్య క్రమానికి విచ్చేసిన స్వామి వారికి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన దశరథ రామిరెడ్డి, వీరభద్ర స్వామి ఆలయ ఛైర్మెన్ విజయ, తొగట వీర క్షత్రియ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడ మోడెం వీరాంజనేయ ప్రసాద్, కోడి శ్రీనివాసులు రెడ్డితదితరు ఆధ్వర్యంలో వేదపండితుల పూర్ణకుంభ స్వాగతాలు, భక్తుల భజనల మధ్య భక్తితో కూడిన ఆత్మీయ స్వాగతం పలికారు .కార్యక్రమాన్నితొలుత దీప ప్రజల్వనతో ప్రారంభించారు. సందర్భంగా శ్రీ శ్రీ చినజీయర్ స్వామి మాట్లాడుతూ దైవభక్తికున్న గొప్పతనాన్ని వివరించారు.రామానుజ చార్యలు, అన్నమయ్య గొప్పతనాలను విసదీకరించారు. ప్రజలందరూ సమానులేనన్న సమతా స్ఫూర్తి అందరిలో రావాలన్నారు నూతన అన్నమయ్య జిల్ల ఆర్థికంగా,రాజకీయంగా,సాంస్కృతికంగా,సంపదలుతో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనిఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నూతన జిల్లాకు అన్నమయ్య గా నామకరణం చేయడం అభినందనీయం, హర్షనీయమన్నారు. ప్రజలందరికీ స్వామి వారు మంగళ శాసనాలు అందచేశారు.
శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి రావడం అదృష్టం : ఎం ఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
రాయచోటికి శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి రావడం అదృష్టమనిఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.స్వామి వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సమతా మూర్తి రామానుజా చార్యుల విగ్రహాన్నిఏర్పాటు చేయడం అనిర్వచనీయమన్నారు.. శ్రీ శ్రీ చిన్నజీ యర్ స్వామి వారు మన ప్రాంతానికి రావాలని ఆకాంక్షించారు.
ముంచెత్తిన అన్నమయ్య సహస్ర గళార్చన…
రాచవీడు అన్నమయ్య కళాపీఠంఆధ్వర్యంలో శ్రీ యరగొల్ల శ్రీనివాస యాదవ్ సంగీత నిర్వహణలో జరిగిన అన్నమయ్య సహస్ర గళార్చన భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ప్రతి సంకీర్తనకూ భక్తులందరూ శృతి కలిపారు.
జై శ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగిన రాయచోటి
జై శ్రీమన్నారాయణ నామస్మరణతో పట్టణం మార్మోగింది. అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసిన సీఎం జగన్,సాధకుడు ఎంఎల్ఏ శ్రీకాంత్ లకు ఆశీర్వాదాలు, అభినందనలు తెలిపిన స్వామీజీలు. పదకవితా పితామహుడు, భక్త శిఖామణి అన్నమయ్య పేరుమీద రాయచోటి ని జిల్లా చేసిన సీఎం జగన్,జిల్లా సాధకుడు ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి లకు శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ స్వామి గారితో పాటు పలువురు స్వామీజీలు, భక్తులు , ప్రజలు ఆశీర్వాదాలు, అభినందనలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ భక్తిలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదన్నారు. తొగటవీర క్షత్రియ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం వీరాంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలసేవలో తనకు అవకాశం వస్తే ఎప్పుడూ ముందుంటానన్నారు.
సేవకు..మెమోంటో…
కార్యక్రమంలో పాలుపంచుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి, వేరబీజెస్త్రా స్వామి ఆలయ కమిటీ చైర్మన్ విజయ , తొగట వీర క్షత్రియ సేవ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు మోడెం వీరాంజనేయ ప్రసాద్, లక్కిరెడ్డిపల్లె ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి,అర్చన స్కూల్స్ మదన మోహన్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ సేఠ్ వెంకట్రామిరెడ్డి, నారాయణ రెడ్డిగారిపల్లె మాజిఎంపిపిటి రెడ్డెన్న, వీరనాగన్న,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ విజయభాస్కర్, నాగరాజు యాదవ్, ఆర్ట్స్ శంకర్, రామాంజనేయులు,సంజీవరెడ్డి, తులసీ గోవిందరెడ్డి,మేడా సునీత,చిన్మయ మిషన్ నాగజ్యోతి, కుప్పం నాగమహేశ్వరి తదితరులుకు శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారు మెమోంటోలు అందించి సత్కరించి ఆశీర్వదించారు.