స్త్రీ, పురుష భేదం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
1 min readలయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్త్రీ,పురుషులు ఇద్దరూ సమాన నిష్పత్తిలో లేకపోతే భవిష్యత్తు లో మానవ మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని,ఆడపిల్లని పుట్టనిద్దాం స్వేచ్ఛగా బ్రతకనిద్దాం అనే నినాదంతో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటరమణ కాలనీ లోని నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ‘గర్భస్థ స్త్రీ, శిశు లింగ నిర్ధారణ చట్టం – 1994 ‘అనే అంశంపై జూనియర్స్ ,సీనియర్స్ విభాగాలలో వ్యాసరచన పోటీలను నిర్వహించారు .ఈ పోటీల ప్రారంభ కార్యక్రమం లో లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ ,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు , పిసి అండ్ పిఎన్డిటి కర్నూల్ సిటీ అడ్వైజరీ కమిటీ మెంబర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ గర్భస్థ స్త్రీ,శిశు లింగ నిర్ధారణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఆడ శిశువు అని తెలుసుకొని అబార్షన్ చేయించుకోవడం వల్ల స్త్రీ శిశు జననాలు తగ్గిపోతున్నాయి అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి , క్లబ్ సభ్యులు, యువతీ యువకులు పాల్గొన్నారు.