వెట్టిచాకిరి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/6-9.jpg?fit=550%2C237&ssl=1)
సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి.. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: బాల బాలికలతో పనిచేయించడం చట్టరీత్యా నేరమని వారు తప్పనిసరిగా చదువుకునే విధంగా చట్టాలు ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అన్నారు. శుక్రవారం వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్ములన దినోత్సవం సందర్బంగా వెట్టి చికారీ వ్యవస్థ పై గోడ పోస్టర్ ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భముగా జెసి ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వెట్టి చికారీ వ్యవస్థ నిర్ములనకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ ను పూర్తిగా రూపమాపేందుకు సంబంధిత అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. సమాజంలో వెట్టిచాకిరి కార్మిక వ్యవస్ధను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉప కార్మిక కమీషనర్ పి. శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ ఏ. శ్రీనివాస్, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, సిడబ్ల్యూసి చైర్మన్ పి. వెంకటేశ్వర రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.సుబ్బా రావు, మహిళా పోలీస్ ఎస్ఐ వి. కాంతిప్రియ , ఐసిడిఎస్ పిడి పి. శారద, డిసిపివో సూర్యచక్రవేణి, పలువురు కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.