రాబోయే రోజుల్లో బుట్టా రేణుకను ఎమ్మెల్యే చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/17-6.jpg?fit=550%2C309&ssl=1)
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణం 09వ వార్డులో వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప ఆధ్వర్యంలో, కౌన్సిలర్ పి.రాజారత్నం గారి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప,09వార్డు కౌన్సిలర్ పి.రాజరత్నం,మునిసిపల్ వైస్ చైర్మన్ మరియు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు డి. నజీర్ అహమ్మద్,జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి యు.కె. రాజశేఖర్, చేనేత జిల్లా అధ్యక్షులు శివ ప్రసాద్,10వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, కార్యకర్తల నుండి విలువైన సూచనలు స్వీకరించారు.అలాగే, బుట్టా రేణుక ని 2029లో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు బూత్ /వార్డు స్థాయి నుంచి సమష్టి కృషి అవసరమని పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకోరావాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి గా చేసుకునే బాధ్యత అందరూ స్వీకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో 09వ వార్డు గౌస్. చిన్నా ఫక్రుద్దీన్ నిరంజన్, సలీం,మక్బుల్, అల్లబకాష్,మహబూబ్ బాషా, బడే సాబ్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.