PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలి : జిల్లా ఎస్పీ

1 min read

– పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరియు పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం
సమన్వయంతో పని చేయాలి
– తీవ్రమైన కేసుల్లో నిందితులకు శిక్షలు పడేందుకు చర్యలు తీసుకోవాలి
– కేసుల దర్యాప్తులు, ట్రయల్స్ ను వేగవంతం చేయాలి
– బ్లిక్ ప్రాసిక్యూటర్లచే సాక్షులకు ముందుగా భ్రీఫింగ్ ఇప్పించాలి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని విడియో కాన్ఫరెన్సు హాల్ లో డిఎస్పీ స్థాయి అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, మరియు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తో జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా 364 ముఖ్యమైన కేసులలో దర్యాప్తులు మొదలు పెట్టినప్పటి నుండి ఆ కేసులు పూర్తి అయ్యేంతవరకు వచ్చే విషయాల పై చర్చించారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు మాట్లాడారు ..తీవ్రమైన కేసులలో ముద్దాయిలకు శిక్షపడే విధంగా చూడాలన్నారు. సాక్షులకు ముందే బ్రీఫింగ్ చేయడం , దర్యాప్తులు, చార్జీషీట్లు వేగవంతం చేయాలన్నారు. చార్జీషీట్లు ఫైల్ చేసేటప్పుడు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.తీవ్రమైన కేసుల్లో నిందితులకు శిక్షలు (conviction)పడే విధంగా చర్యలు తీసుకుంటేనే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. కేసుల పరిశోధన పురోగతిని వేగవంతం చేయాలన్నారు.సాక్షులను సరియైన సమయములో కోర్టు ఎదుట హాజరు పరచాలన్నారు. కోర్టులో కేసులు వీగిపోకుండా నిందితులకు శిక్షలు పడేందుకు తీసుకోవలసిన చర్యలు, త్వరితగతిన దర్యాప్తులు, కేసులు ఫైలింగ్ చేసే విధానం తదితర విషయాలను చర్చించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, డిప్యూటి డైరెక్టర్ ప్రాసిక్యూషన్ అజకల్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు వెంకటాద్రి, వెంకట్రామయ్య, యుగంధర్ బాబు, వినోద్ కుమార్, నాగభూషణం, కెవి మహేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు మానిటరింగ్ సిఐ రామయ్య నాయుడు, డిసిఆర్ బి సిఐ గుణశేఖర్ బాబు పాల్గొన్నారు.

About Author