కర్నూలు అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలి..
1 min readకర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
వైసీపీని వీడి టిడిపిలో చేరిన సీనియర్ నాయకుడు దేవా
వైసీపీలోకి వెళ్లిన సంవత్సరంలోపే మళ్లీ సొంతగూటికి చేరిన దేవా బృందం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని 48వ వార్డుకు చెందిన సీనియర్ నేత దేవా, ఆయన సోదరుడు శ్యాంలు తమ బృందంతో కలిసి వైసీపీని వీడి.. మౌర్య ఇన్ లో టి.జి భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా టి.జి భరత్ మాట్లాడుతూ వైసీపీలోకి వెళ్లిన ఏడాదిలోపే మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి రావడం సంతోషకరమని అన్నారు. కొన్ని కారణాల వల్ల పార్టీ నుండి వెళ్లిపోయిన దేవా మళ్లీ వాస్తవాలు తెలుసుకొని సొంత ఇంటికి రావడం మంచి పరిణామమన్నారు. ఎలాంటి స్వప్రయోజనాలు ఆశించకుండా దేవా తమ దగ్గరకు వచ్చారన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు కష్టపడాలన్నారు. కర్నూలు అభివృద్ది చెందాలంటే మంచి నాయకుడు కావాలన్నారు. అభివృద్ధి తప్ప ఇతర ప్రయోజనాలు ఆశించని తమ టి.జి కుటుంబం రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం పార్టీలో చేరిన దేవా మాట్లాడుతూ వైసీపీ వల్ల ప్రజలకు నష్టం తప్ప లాభమేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టి.జి భరత్ ను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. పార్టీలో చేరిన వారిలో శీను, లక్ష్మన్న, పెద్ద శేషన్న, యుగంధర్, బీసన్న, దేవరాజు, దీవన్న, క్రిష్ణ, ఆయుబ్ బాషా, నాగేంద్ర, సామ్, మహేష్, అజయ్, పాల్, ఆంజనేయులు, రాముడులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసమూర్తి, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, టిడిపి సీనియర్ నేత మన్సూర్ ఆలీఖాన్, టి.ఎన్.ఎస్.ఎఫ్ నాయకుడు రాజ్ కుమార్, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.