అక్కడ దొరికినదంతా.. జగన్ డబ్బే !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హెటిరోలో దొరికిన సొమ్మంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. రూ. 147 కోట్లు కాదని ఇంకా వేల కోట్లలో దాచారన్నారు. ఇదంతా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలో దోచిందేనన్నారు. సీఎం జగన్ మల్లె పూలు కూడా అమ్ముకుంటారని ఎద్దేవా చేశారు. విశాఖలో వివిధ కార్యాలయాలను రూ. 25 వేల కోట్లకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఏ ప్రజలు అయితే అన్ని సీట్లు ఇచ్చి గెలిపించారో.. అదే ప్రజలు కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. జైల్లో చిప్ప కూడు తిన్నవారికి పాలనపై అవగాహన ఏం ఉంటుందన్నారు. ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు.