అంతా నా ఇష్టం.. యు ఆర్ గెట్ అవుట్
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: అంతా నా ఇష్టం.. యు ఆర్ గెట్ అవుట్ అని మహానంది దేవస్థానం ఆలయ అధికారి ఒకరు అన్నట్లు విశ్వాసనీయ సమాచారం. గత మూడు రోజుల క్రితం మహానంది దేవస్థానంలో రాత్రి మహా నివేదన కార్యక్రమం దాదాపు 5 నుండి 10 నిమిషాలు ఆలస్యం అయినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించి ఔట్సోర్సింగ్ నందు పనిచేసే ఒక పరిచారానికి పై సంబంధిత అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మీరు నేను చెప్పేంతవరకు విధులకు హాజరు కావద్దని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేటికీ కూడా ఆ పరిచారకుడు విధులకు దూరంగా ఉన్నారు. గతంలో దాదాపు మహాశివరాత్రి నుంచి ఉగాది పర్వదినం సందర్భంగా పలు ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై నేటి వరకు కూడా అధికారిక పెత్తనం ఉండడంతో కొంతమందిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆచార్య మధు కమిటీ పేరుతో కమిటీలు వేసి కాలయాపన చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి . ఒకవైపు ఇలాంటివి.ఇవన్నీ నాకు వర్తించవని నేను చెప్పిందే వేదంగా భావిస్తూ మీ వేదాలు పక్కనపెట్టి నా ఆదేశాలు పాటించాలని ఆర్డర్ అనధికారికంగా వేసినట్లు తెలుస్తోంది.. దీనిపై ఆలయంలో పనిచేసే పలువురు సిబ్బంది ఆలయ అధికారి పని తీరుపై ఆశ్చర్యం ఆగ్రహం వ్యక్తం చేస్తుంనట్లు తెలుస్తుంది.