PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికలకు సర్వం సిద్ధం..

1 min read
ఎన్నికల బందోబస్తుపై మాట్లాడుతున్న ఎస్పీ డా. ఫక్కీరప్ప

ఎన్నికల బందోబస్తుపై మాట్లాడుతున్న ఎస్పీ డా. ఫక్కీరప్ప

5వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం
– పోలింగ్​ బూత్​ పరిసరాల్లో 30 యాక్ట్​, 144 సెక్షన్​ అమలు
– కలెక్టర్​ జి. వీరపాండియన్​, ఎస్పీ ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కర్నూలు జిల్లాలో బుధవారం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ జి. వీరపాండియన్​, ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. బుధవారం కలెక్టర్​ కాన్ఫరెన్స్​ హాల్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో 44 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని కేటాయించామన్నారు.
బందోబస్తు..కట్టుదిట్టం : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ డా. కాగినెల్లి ఫక్కీరప్ప ఆధ్వర్యంలో 1 కమాండెంట్ , 3 అడిషనల్ ఎస్పీలు, 17 మంది డిఎస్పీలు, 105 మంది సిఐలు, 143 మంది ఎస్సైలు , 508 మంది ఎఎస్సై లు / హెడ్ కానిస్టేబుల్స్, 1,038 మంది సివిల్ పోలీసులు, 28 మంది ఎఆర్ ఎస్సైలు / ఎఆర్ హెడ్ కానిస్టేబుల్స్, 64 మంది ఎఆర్ పోలీసులు, 150 మంది స్పెషల్ పార్టీ పోలీసులు , 145 మంది ఇతర శాఖల చెందిన సిబ్బంది , 374 మంది హోంగార్డులు, 7 ప్లటూన్ల ఎపిఎస్పీ, 2 పట్లూన్ల ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బంది 900 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులు, 1,752 గ్రామ సచివాలయ పారా స్టాఫ్ (డిజిటల్ సిబ్బంది) Total = 5,386 మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారు. ఇందులో 20 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, 20 స్ట్రైకింగ్ ఫోర్సులు , 238 పోలీసు రూట్ మొబైల్స్ తో పోలీంగ్ కేంద్రాల వద్ద నిరంత నిఘా ఏర్పాటు చేయడమైనదన్నారు.
ప్రత్యేక నిఘా : సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలు, ట్రబుల్ మాంగర్స్ పై పోలీసు బలగాలతో ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. పోలింగ్ జరిగే ప్రాంతాలలో బాడీ ఒన్ కెమెరాలు, వీడియో కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారన్నారు.
ఎన్నికల కోడ్​ : ఏప్రిల్ 3 వ తేది నుండి ఎన్నికల కోడ్ అమలులో వచ్చినప్పటి నుండి జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిని, నేర చరిత్ర గల వారిపై మొత్తం 612 మందిని బైండోవర్‌ చేసి 88 కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై 9 కేసులు నమోదు చేశామన్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, ఫ్లయిండ్ స్క్వాడ్స్ తో ముమ్మరంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేసి 43 కేసులు నమోదు చేశామన్నారు.
సీజ్ చేసినవి : నగదు 10 లక్షల 67 వేల 400, 11 కేజిల 200 గ్రాముల వెండి( విలువ 3 లక్షల 70 వేలు), 15 కేజిల గంజాయి, (విలువ 1 లక్ష), 1,725 గుట్కా ప్యాకెట్లు, జిల్లా వ్యాప్తంగా 1,306 లైసెన్సులు కలిగిన తుపాకులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మద్యం 865 లీటర్లు, నాటుసారా 108 లీటర్లు, 3 కార్లు, 2 ఆటోలు, 12 బైక్ లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

About Author