మూల పెద్దమ్మ జాతరకు సర్వం సిద్ధం.. ఆలయ చైర్మన్ చిన్నన్న
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ఈనెల 23వ తేదీ నుండి మొదలవుతున్న మూల పెద్దమ్మ జాతరకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు అమ్మవారిని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మంగళవారం నాడు ఈవో మోహన్ తెలిపారు క్యూలైన్లు మంచినీటి వసతి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన దాత మిర్చి వ్యాపారి వాసగిరి శ్రీనివాసులు వాసగిరి లక్ష్మీదేవి సహకారంతో ఆలయ ప్రాంగణంలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయిలో రేకుల తో శాశ్వతంగా పైకప్పు ఏర్పాటు చేసినట్టు వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్టు ఆలయ ప్రాంగణంలో జెఎస్డబ్ల్యు సిమెంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఫిల్టర్ ప్లాంట్ ద్వారా ఉచిత మినరల్ వాటర్ అందుబాటులో ఉంటుందని భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జెఎస్డబ్ల్యు ప్రభుత్వ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్టు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆర్కెస్ట్రా బండలాగుడు గుండు సండు తాడు లాగుట వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని మూల పెద్దమ్మ ఆలయ చైర్మన్ చిన్నన్న ఈవో సీతా మోహన్ ఆలయ సిబ్బంది వాల్మీకి సేవా సమితి సభ్యులు తెలిపారు.