PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లిటిల్ ఏంజిల్స్ లో సైన్స్ ఫేర్​​ కు సర్వం సిద్ధం

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు పట్టణ లిటిల్ ఏంజిల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధ, గురు వరాల్లో జరుగు సైన్స్ వేర్ తమ తమ ప్రతిభను ప్రదర్శిస్తూ విద్యార్థులు ప్రాజెక్టులను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎం ఎస్ ఇమ్మానియేల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ప్రతి సంవత్సరం సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థుల చే వివిధ రకాల ప్రాజెక్టులను తయారు చేయించి ప్రదర్శనకు పాఠశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున నియోజకవర్గం లోని ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల సందర్శించి విద్యార్థులచే తయారు చేయబడ్డ ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని కల్పించాలన్నారు. ఈ ప్రాజెక్టుల తయారీలో పాఠశాల హెచ్ఎం అప్పియ ప్రశాంత ఉపాధ్యాయులు అనిల్, సలీం, తదితర ఉపాధ్యాయుల పాత్ర ఎంతగానో ఉందన్నారు.

About Author