PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేరస్తులను పట్టుకునేందుకు సర్వం సిద్ధం

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లాలో గత వారం రోజులనుండి జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారి ఆదేశాలమేరకు జిల్లా లోని ఫింగర్ ప్రింట్ యూనిట్ నందు నేరస్థలంలో నేరస్తుల ఆనవాళ్ళు ఎలా సేకరించాలి వాటిని సంబందిత అదికారుకు ఎలా అందించాలి అనే విషయాలపై కొంత మంది పోలీసులకు శిక్షణ ఇచ్చి జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ లకు పంపుటకు సిద్ధం చేసిన వారిని జిల్లా ఎస్పీగారు స్వయంగా పరిశీలించి వారికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి సబ్ డివిజన్ లకు పంపడం జరిగింది.ఈ శిక్షణ కల్గిన పోలీసులు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ లో ఉంటూ వారి విధులను నిర్వర్తిస్తూ దొంగతనాలు ,హత్యలు ,మానభంగాలు మొదలగు నేరాలకు పాల్పడిన వ్యక్తులకు సంబంధించి కచ్చితమైన ఆదారాలను వెంటనే సేకరించడానికి క్రైమ్ స్పాట్ వాహనంలో శిక్షితులైన పోలీసులతోపాటు నేర నిరూపణకు సంబంధించిన అన్ని పరికరాలను అందుబాటులో ఉంచారు. క్షణాలలో క్రైం స్పాట్ వాహనం సంఘటన స్థలానికి వెళ్లడంతో పాటు అక్కడ ఏమైనా ఆనవాళ్ళు కనిపిస్తే వాటిని ఫోటోలు, వీడియో చిత్రీకరణ కూడా చేయడానికి కెమెరాలు ఏర్పాటు చేశారు. అత్యాచారం, హత్యలు చేసిన ప్రాంతాల్లో ఆయుధాలపై ఉన్న వేలిముద్రలను కూడా వెంటనే ఈ వాహనంలో ఉండే సిబ్బంది సేకరించే విధంగా అన్ని అత్యధిక అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు .నేరం జరిగిన ప్రాంతాల్లో ఎవరు ఉండకుండా చుట్టూ క్రైమ్ స్పాట్ అని కనిపించే కంచెను ఏర్పాటు చేసి నేరస్థలాన్ని భద్రపరుస్తారు.గతంలో జిల్లా కేంద్రంలో క్లూస్ టీం ఉండేది కానీ ప్రతి సబ్ డివిజన్ కు క్రైమ్ స్పాట్ వాహనం ను కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పాటు చేశాక వాహనాలతో శిక్షణ కలిగిన సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా కేటాయిస్తూ వాహనంలో ఉన్న పరికరాల ఆధారంగా నేరస్తులను పసిగట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు నేరానికి సంబంధిత ఆధారాలను అందించడం జరుగుతుందని తెలియజేస్తూ అంతేకాకుండా అక్కడ నిందితునికి సంబంధించిన ఆనవాళ్లు ఉంటే వేలిముద్రలను వెంటనే సేకరించే అవకాశం ఉండేలా ఏర్పాటు చేశారు. . దూర ప్రాంతం నుండి క్లూస్ టీం వచ్చేలోగా ఆలస్యం కాకుండా వెంటనే విచారణ చేపట్టే విధంగా ఖచ్చితమైన దోషులను పట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు.

About Author