PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంతా నా ఇష్టం. రియాల్టర్ ముసుగులో దౌర్జన్యం

1 min read

– ఆది నుంచి అక్రమాలు
– కన్ను పడిందా ప్రభుత్వ భూములు గోవిందా
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: అడ్డు అదుపు లేకుండా అక్రమంగా పుట్టుకొస్తున్న రియల్ వెంచర్లు అనుమతులు లేకుండా కొనుగోలుదారులకు ఫ్లాట్లను అంటగట్టేస్తున్నారు ఫ్లాట్లు తీసుకున్నాక అధికారులకు చుట్టు తిరగాల్సిందే కోట్లలో దండా చేస్తున్న ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్న ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్న అతనికి మాత్రం చలనం లేదు.ఎవడైతే నాకేంటీ -పైసామే పరామాత్మహై – ఇలా ఇచ్చుడు అలా పర్మిషన్ తెచ్చుడు.బీకే. సింగ్ అక్రమాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు.!కౌలూరులో బీకే. సింగ్ వారి గ్రీన్ సిటీ వెంచర్ పై సమగ్ర విచారణ జరపాలి.ప్రజలు ప్లాట్లు కొనేముందు ఆలోచన చేయాలి.ఉమ్మడి జిల్లాలో అక్రమాలకు కేరాఫ్ గా మారిన బీకే.సింగ్ వెంచర్లు.న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాం :- ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రజాసంఘాలు , పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో తిరుమల గిరి గ్రీన్ సిటీ పేరుతో బీకే. సింగ్ ఏర్పాటు చేసిన నూతన వెంచర్లో అనేక అక్రమాలు జరిగాయని , ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించుకున్నారని పేర్కొంటూ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ (ఏ.ఐ.ఎఫ్.బి) , రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్) నాయకులు మంగళవారం స్ధానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ మల్లిఖార్జున రెడ్డి కి బీకే.సింగ్ వెంచర్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని నేతలు సమష్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ (ఏ.ఐ.ఎఫ్.బి) రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు , ఆర్వీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రియాజ్ మాట్లాడుతూ …అక్రమాలకు మారుపేరు బి.కె.సింగ్ అన్నారు. ఎక్కడ చూసినా ఏ వెంచర్ చూసినా ప్రభుత్వ భూములు ఆక్రమించకుండా అతను వెంచర్ వేయరన్నారు. పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో నూతనంగా వేసిన వెంచర్ తిరుమలగిరి గ్రీన్ సిటీ పేరుతో దాదాపు 60 ఎకరాలలో వెంచర్ వేసారనీ, అందులో చాలా వరకు వాగు భూములు రస్తా భూములు కలుపుకొని వెంచర్ వేసారన్నారు.
ఈ వెంచర్ అక్రమాలపై పాణ్యం తహసిల్దార్ కి మంగళవారం నాడు వినతిపత్రం ఇచ్చారు
ఈ అక్రమాలకు సహాయకులు ఈ రెవెన్యూ వారే అన్నారు. సర్వేనెంబర్ 400లో భూమి 13 ఎకరాలకు పైగా ఉంటే అడంగల్ రికార్డులో కేవలం 3ఎకరాలు ఉన్నట్లు చూపారన్నారు. అలాగే సర్వే. నెం. 423,425,లను కూడా సర్వే చేసి హద్దులు చూపాలన్నారు. అధికారులు అమ్యమ్యాలకు తలొగ్గి ఇటువంటి అక్రమార్కులను ప్రోత్సహిస్తూ సామాన్యులకు ప్లాట్లు అమ్మి కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ప్రజలు కూడా ఇలాంటి వెంచర్లలలో ప్లాట్లు కొనేముందు అలోచన చేసి కొనాలన్నారు. వారు ఇచ్చే ఆఫర్లకు పడిపోయి మోసపోవద్దన్నారు. తహసిల్దార్ తక్షణమే సర్వే చేయించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. దీనిపై వివరణ కోరగా పాణ్యం ఎంఆర్ఓ మల్లిఖార్జున రెడ్డి మాట్లాడుతూ ఈ విషయంపై పూర్తి స్ధాయిలో విచారణ జరిపి , చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో హనుమేష్ , చిరంజీవి , రామ్మోహన్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author