అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన : పవన్ కళ్యాణ్
1 min read
పల్లెవెలుగు వెబ్ : సైదాబాద్ లో ఆరేళ్ల బాలిక పై హత్యాచారం జరిగిన ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పవన్ వస్తున్న విషయం తెలిసి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అభిమానుల రద్దీ, తోపులాట కారణంగా పవన్ కారు వద్దకే బాధితురాలి తండ్రిని పిలిపించుకుని మాట్లాడారు. అభిమానుల తోపులాటలో స్థానికుడి కారు ధ్వంసమైంది. హత్యాచారానికి పాల్పడిన నిందితుడిని శిక్షంచే వరకు, బాధితుడికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. చిన్నారికి జరిగిన దారుణం తనను ఎంతగానో కలచివేసిందని అన్నారు. అంతా సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన ఇది అని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు బాధితులకు అండగా నిలవాలని, ఏ విధంగా సహాయం చేయగలరో ఆలోచించాలని చెప్పారు.