ఆంధ్ర యూనివర్శిటీలో దుర్మార్గ పాలన సాగుతోంది !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్ర యూనివర్శిటీలో దుర్మార్గ పాలన సాగుతోందని విమర్శించారు మాజీ ఎంపీ హర్షకుమార్. వీసీ ప్రసాద్ రెడ్డి రాజకీయాన్ని జొప్పించి యూనివర్శిటీ ప్రతిష్ఠ మంటగలుపుతున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తితో ఉండాలని, యూనివర్సిటీపైనా, యూనివర్సిటీ అధికారులు తీసుకునే నిర్ణయాలపైనా రాజకీయ నాయకుల ప్రభావం ఉండకూడదన్నారు. కానీ, ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోందని, ఓ రాజకీయ పార్టీ కార్యాలయంగా యూనివర్సిటీని ప్రస్తుత పాలకులు మార్చేశారని హర్షకుమార్ ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏయూ ప్రతిష్ఠ మసకబారిందన్నారు.