మాజీ మంత్రి భూమినే మార్చేసారట !
1 min readపల్లెవెలుగు వెబ్ : అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలో తన పేరు మీద ఉన్న భూమిని.. మరొకరి పేరు మీద మార్చారంటూ మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. అధికార ఒత్తిళ్లకు లొంగి కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలని హితవుపలికారు. మాజీ మంత్రి భూమినే మరొకరి పేరు మీద మారిస్తే.. సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు రైతులకు అన్యాయం చేయోద్దని కోరారు. వివరాలు సక్రమంగా ఉండి.. సాగు చేస్తున్న వారికి న్యాయం చేయాలని కోరారు.