NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ సైనికుల సమస్యల పరిష్కరానికి కృషి

1 min read

స్టేషన్ కమాండర్ తెలంగాణ ఆంధ్ర సవేరియా బ్రిగేడియర్ సోమశేఖర్ సేన మెడల్

పల్లెవెలుగు వెబ్​: ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానన్నారు dy goc tasa /స్టేషన్ కమాండర్ తెలంగాణ ఆంధ్ర సవేరియా బ్రిగేడియర్ సోమశేఖర్ సేన మెడల్, ncc group కమాండర్ వారు col రమేష్. సోమవారం జిల్లా కేంద్రంలోని మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయ ఆవరణంలో కర్నూలు జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు నర్రా పేరయ్య చౌదరి  ఆధ్వర్యంలో మాజీ సైనికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు పలు సమస్యలను dy goc tasa/స్టేషన్ కమాండర్ తెలంగాణ ఆంధ్ర సవేరియా బ్రిగేడియర్ సోమశేఖర్ సేన మెడల్ దృష్టికి తీసుకొచ్చారు.  కర్నూలులో ఎంప్లాయిమెంట్​ హాస్పిటల్​  లేదని,  సంక్షేమ సంఘానికి కొత్త భవనం కట్టించాలని , వితంతువులకు పింఛన్​ రావడంలేదని తదితర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు.  ఇందుకు సానుకూలంగా స్పందించిన స్టేషన్​ కమాండర్​ త్వరలో సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  ఆత్మీయ సమ్మేళనంలో కర్నూలు జిల్లా మాజీ సైనికుల సంఘం సెక్రెటరీ ఎం సుధాకర్,  ట్రెజరర్ నజీర్ అహ్మద్ మరియు కమిటీ సభ్యులు కెసి రాముడు, subur తిరుమల్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

About Author