పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రీ అందజేత
1 min read
పత్తికొండ , న్యూస్ నేడు: పత్తికొండ ఆదర్శ పాఠశాల అలాగే బిసి బాలికల వసతి గృహం గృహంలో పదో తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం పరీక్ష ప్యాడ్స్, పెన్నులు, స్కేలు, పెన్సిళ్లను అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ మండల కార్యదర్శి అల్తాఫ్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందని, విద్యార్థులు చదువుకొని మంచి భవిష్యత్ పొందాలని అభిలాషించారు.ఈ కార్యక్రమంలో AISF పత్తికొండ మండల అధ్యక్షులు రమేష్, మండల ఉపాధ్యక్షులు భాష, పట్టణ కార్యదర్శి రవి, దసరాదు వెంకటేష్, సూరి తదితరులు పాల్గొన్నారు.