PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ ఉపాధి’ పనుల పరిశీలన… కూలీలతో ముఖాముఖి..

1 min read
  • కర్నూలులో మూడు రోజులు పర్యటించనున్న ఎస్​.టీ.ఈ.ఎం అధికారులు
  • పనుల వివరాలపై ఆరా …

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను. Centre for Symbiosis of Technology. Environment and Management (STEM) to conduct Special Monitoring (Phase 1) of MGNREGS 7 MAY-G Major Progremmes of MORD under National Level Monitoring (NLM) వారు, కర్నూలు జిల్లా లో 18.01.2022 నుండి 22.01.2022 వ తేది వరకు అనగా 3 రోజులు పాటు జాతీయ గ్రామీణ హామీ పథకం క్రింద జరిగిన పనులు మరియు జరగతున్న పనులు, 100 రోజులు పని దినాలు, జాబ్ కార్డు, ఉపాధి పనుల వద్ద వివరాలతో ఏర్పాటు చేసిన Name Boards ను, పారం పాండ్స్ పెర్క్యులేషన్ ట్యాంకులు, పండ్ల తోటలను రోడ్డు వెంబడి చెట్టులను, పరిశీలించడం జరిగినది.

అక్కడి ఉపాధి కూలీలతో ముఖాముఖి చేపట్టారు. 17.01.2022 నుండి 21.01.2022 ఈ క్రింది మండలములలోని గ్రామాలను సందర్శించారు. 17.01.2022 తేదిన ప్యాపిలి మండలములో హుస్సేనాపురము, కొమ్మేమం మరియు ప్యాపిలి గ్రామములు 18.01.2022 తేదిన తుగ్గలి మండలము రాతన, పగిడిరాయి గ్రామములు, 19.01.2022 ఆస్పరి మండలములో ఆస్పరి. చిన్న హోత్తూరు మరియు బిలెకల్లు గ్రామములు, 20.01.2022 తేదిన ఆదోని మండలములో మదిరే, పాండవగల్గు, పెద్ద తుంబలం. అలాగే మదిరే గ్రామ సర్పంచ్ వారు ఉపాధి హామీ పని దినాలు 100 రోజులు నుండి 200 రోజులకు మరియు రోజు వారి కూలీలకు 245/-లు నుండి Rs.500/- పెంచాలని, జలకళ క్రింద కి ఎకరాల నుండి 1. ఎకరాలకు పెంచాలని కోరారు. 21.01.2022 ఆస్పరి మండలములోని బిల్లేకల్లు, తుగ్గలి మండములోని ముక్కెళ్ల  గ్రామంలో ఉపాధి హమీ పనులను పరిశీలించారు.  కార్యక్రమములో సహాయ పథక సందాలకులు, క్రిష్ణ మోహన్, (డోన్ క్లస్టర్), సురేష్ బాబు, (ఆలూరు క్లస్టర్) వారు, మరియు పద్మావతి (పత్తికొండ క్లస్టర్), గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author