PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డి.వై.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో పరీక్ష విజయవంతం

1 min read

– పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నాపత్రం విడుదల చేసిన డి.ఎస్.పి రామాంజనేయులు నాయక్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: డివైఎఫ్ఐ అర్హులందరికీ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించాలని పోటీ పరీక్షల్లో ఒత్తిడి తట్టుకునే సామర్థ్యం పెంపొందించుకోవాలని కానిస్టేబుల్ నమూనా పరీక్షస్థానిక నంద్యాల పట్టణంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు మేఘన కోచింగ్ సెంటర్, సిద్ధార్థ కోచింగ్ సెంటర్, సుభాష్ చంద్రబోస్ సెంటర్, ప్రతిభ కోచింగ్ సెంటర్, నందు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు నమూనా పరీక్ష ఏర్పాటు చేయడం జరిగిందని నంద్యాల డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… డి.వై.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో పరీక్ష విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అర్హత కలిగిన విద్యావంతులైన నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతని వారు గుర్తు చేశారు. పోటీ పరీక్షల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం నేటి నిరుద్యోగ విద్యావంతులైన యువతి, యువకులకు అవసరమని, ఆ శక్తిని , సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, నిరంతర విజ్ఞానార్జన, నిరంతర వ్యాయామం, విలువలతో కూడిన జీవితం, దినచర్యలో క్రమశిక్షణ ప్రాథమిక అవసరం అన్నారు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పి.డి.ఎఫ్.), ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ విద్యావంతులకు “మోడల్ నమూనా పరీక్షలు” నిర్వహిస్తూ ఉండడం జరుగుతూ ఉందని, ఈ సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ నమూనా పరీక్షలు నిర్వహించి అర్హత కలిగినటువంటి విద్యావంతులు వారి సామర్థ్యాన్ని ముందుగా పరీక్షించుకోవటానికి, వారిలో ఉన్న ఒత్తిడి పోగొట్టుకోవడానికి, వారికి పరీక్షల పట్ల అవగాహన పెంచుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడు లావున నిర్వహిస్తుండడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం డి.వై.ఎఫ్.ఐ. చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు వినీత్, కిరణ్, మధు, శాంతి వర్ధన్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author