NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుర్తింపు లేని కోర్సుల‌కు ప‌రీక్ష‌లా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎంబీఏ బిగ్‌ డేటా అనాలసిస్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ కోర్సుల్లో చేరి చివరి నిమిషంలో పరీక్షలకు అనుతివ్వాలంటే ఎలా అని హైకోర్టు విద్యార్థులను ప్రశ్నించింది. ఈ రెండు కోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షలు రాయడానికి అనుమతి ఇచ్చేలా విద్యాశాఖ, జేఎన్‌టీయూ, ఉన్నత విద్యామండలికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సికిందరాబాద్‌లోని స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. జేఎన్‌టీయూ నుంచి అఫిలియేషన్‌ తీసుకోకుండా, ఎలాంటి సిలబస్‌, కోర్సు రూపకల్పన లేకుండా ఆ కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చిందని వ్యాఖ్యానించింది. ఏ వివరాలు పరిశీలించకుండానే విద్యార్థులు తమ సొంత రిస్కుతో కళాశాలలో చేరారని తెలిపింది. దీనికి యూనివర్సిటీ బాధ్యత లేదని స్పష్టంచేసింది.

                                             

About Author