పెద్దకడబూరు పీఎస్కు ఎక్స్లెన్సీ అవార్డు
1 min read– ఎస్పీ, డీఎస్పీ, ఎస్ఐని సన్మానించిన మంత్రి బుగ్గన
పల్లెవెలుగు వెబ్, కర్నూలు క్రైం: ఎక్సలెన్సీ అవార్డును కేంద్ర హోంశాఖ అవార్డు ప్రకటించడం , పెద్దకడుబూరు పోలీసుస్టేషన్ కు జాతీయస్ధాయిలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా కు రావడం అభినందనీయమని ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. బుధవారం కర్నూలు నగరంలోని స్టేట్ గేస్ట్ హౌస్ లో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ని, ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్, కోసిగి సిఐ ఈశ్వరయ్య, పెద్దకడుబూర్ ఎస్సై శ్రీనివాసులును మంత్రి అభినందించారు. నేరాల అదుపు, నియంత్రణ కమ్యూనిటి పోలీసింగ్, గ్రామ రక్షక దళాలు, సిసి కెమెరాలు ఏర్పాటులో ఆదర్శంగా నిలిచారన్నారు. ఇదే స్పూర్తితో పోలీసింగ్ లో ఆధునిక , సాంకేతి టెక్నాలజిని వినియోగించి, జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు మెరుగైన సేవలందించి పోలీసు శాఖకు ఇంకా మంచి పేరు తీసుకురావాలని పలువురు మంత్రులు, జిల్లా కలెక్టర్ , జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, నంది కొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డా.జె. సుధాకర్, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య , జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, కె.ఎం.సి.కమీషనర్ డీకే బాలాజీ, ఏ.ఎస్.పి గౌతమి సాలి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.