ఎక్సైజ్ శాఖ, ప్రత్యేక కార్యదర్శి ని, నివేదిక కోరిన రాష్ట్ర లోకాయుక్త జస్టిస్
1 min readపల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: కృష్ణాజిల్లా ,చల్లపల్లి మండలం, వెలువోలు గ్రామంలో ఏప్రిల్, 5వ తేదీ 2020 సంవత్సరంలో తాటి చెట్టు పై, నుండి పడి మరణించిన గీత కార్మికుడు , మురాల వీరబాబు భార్య, మురాల ఈశ్వరికి, ఎక్స్ గ్రేషియా , మంజూరు కొరకు రాష్ట్రం లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది అని ఉయ్యూరు కి చెందిన జంపాన శ్రీనివాస్ గౌడ్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ విషయమై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, డా| |రజిత భార్గవను రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి .లక్ష్మణ రెడ్డి నివేదిక కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ 2023న రాష్ట్ర లోకాయుక్తకు మురాల ఈశ్వరి చేసిన ఫిర్యాదు మేరకు, రాష్ట్ర లోకాయుక్త పై ఉత్తర్వులను జారీ చేశారు. ఉత్తర్వులు ప్రకారం ఎక్సుగ్రేషియా మంజూరు చేయమని ,మురాల ఈశ్వరి ఫిర్యాదు చేయడం జరిగింది. గీత కార్మికుడైన మురాల వీరబాబు తండ్రి వెంకటరెడ్డిమ్మ ,ఏప్రిల్ 5 2020 తాటి చెట్టు పై నుండి పడి మరణించినందున రాష్ట్రంలో, ఏప్రిల్ 1, 2020 నుండి అక్టోబర్ ,2, 2020 వరకు వైయస్సార్ భీమా ఇన్సూరెన్స్ అమలులో లేనందున ,గీత కార్మికులు మరణిస్తే మంజూరు చేసే వై.ఎస్.ఆర్ గీత కార్మిక భరోసా పథకం కింద మురాల ఈశ్వరికి ఆర్థిక సహాయం మంజూరు చేయటానికి రెవెన్యూ శాఖ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డా|| రజితభార్గవ ,కృష్ణాజిల్లా ప్రొహిబిషన్ &ఎక్సైజ్ సూపరింటెండెంట్ ,తగు చర్యలు తీసుకోగలంలకు , రాష్ట్ర లోకాయుక్త కు ఫిర్యాదు చేయడం జరిగిందని , ఉయ్యూరు కు చెందిన, సామాజిక కార్యకర్త జంపానశ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.