ఉప్పొంగిన అభిమానం..!
1 min readకొండారెడ్డి బురుజు వద్ద సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
- కేక్ కట్ చేసిన మేయర్, కోడుమూరు ఎమ్మెల్యే
- కర్నూలు వైసీపీ నాయకులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో అన్నదానం
పల్లెవెలుగు, కర్నూలు: జననేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం కర్నూలు నగరంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న కొండారెడ్డి వద్ద (బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు) వైసీపీ నాయకులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను మేయర్ రామయ్య, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కట్ చేసి, కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా బాణ సంచాకాల్చి… సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం కూడా భారీ కేక్ కట్ చేశారు. కేక్‌ను ఒకరికొకరు తినిపించుకుంటూ.. సీఎం జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ… సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం కర్నూలు నగర వైసీపీ నాయకులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. సంక్షేమం…అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైసీపీ బీసీ సెల్ జోనల్ ఇన్చార్జ్ నాగరాజు యదవ్, కార్పొరేటర్ కృష్ణ కాంత్, పెరుగు శ్రీనివాస రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, చంద్రశేఖర్, రాము, సతీష్ తదితరులు పాల్గొన్నారు.