ఉత్తర్వులను అమలు చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: కృష్ణా జిల్లాలోని మండల కేంద్రమైన తోట్లవల్లూరు ప్రధాన రహదారి వెంబడి ఉయ్యూరు నుండి తోట్ల వల్లూరు వరకు ఉన్న ఆక్రమణలను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్ ఉత్తర్వులు ప్రకారం వెంటనే తొలగించవలసిందిగా ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శిలను ,తోట్లవల్లూరు మండల పంచాయతీల విస్తరణాధికారిని కోరుచున్నాము.అని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.2022 సెప్టెంబర్ 14వ తేదీ గుంటూరు జిల్లా మేడికొండూరు మండలాని కిచెందిన, గుంటుపల్లి రామారావు ,రాష్ట్ర హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులను జారీ చేస్తూ గ్రామపంచాయతీ రహదారులు స్థలాలలోని, గ్రామపంచాయతీఆక్రమణలను6 నెలల్లో ఖాళీ చేయవలసిందిగా ఇందుకు గ్రామపంచాయతీ కార్యదర్శులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు 2011లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జారీచేసిన, జి. ఓ .ఎం. ఎస్. నెం. 188 ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మండల ప్రజా పరిషత్తులు జిల్లా ప్రజా పరిషత్తులు తమ ఆస్తుల రిజిస్టర్లు తయారుచేసి ఆ ఆస్తులను రెవెన్యూ శాఖ సహకారంతో గుర్తించి ,6 నెలల్లో స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో ఆదేశించి ఉన్నారు . ఉయ్యూరునుండి మండల కేంద్రమైన తోట్లవల్లూరు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించి ఆయా గ్రామపంచాయతీలు స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శుల ను తహశీల్దార్ కె.శివయ్య అందుకు సహకరించాలని కోరుతున్నామని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలోతెలియజేశారు.